తెలంగాణలో త్వరలోనే 14 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. త్వరలోనే 14,000 ప్రభుత్వ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 73,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని వారు వెల్లడించారు. అలాగే మహిళా సంఘాల కోసం 33 నెలల్లో రూ. 73,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాస రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
